తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి నుండి తనకు ప్రాణహాని ఉందని, గతంలో జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసినందుకు తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని,
తనకు రక్షణ కల్పించాలని విశాఖ కమిషనర్ ను కోరారు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈయన విశాఖ నార్త్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
కాగా, జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ ను కామన్ సింబల్ గా కేటాయించింది ఎన్నికల సంఘం. అయితే, లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేయటం చర్చనీయాంశం అయ్యింది. గత ఎన్నికల్లో జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన జేడీ లక్ష్మీనారాయణ ఆ తర్వాత పార్టీని వీడి సొంత పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగారు. మరి, ఈ ఎన్నికల్లో అయినా లక్ష్మీనారాయణ విజయం సదిసతారో లేదో చూడాలి.