ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గోరంట్ల అసోసియేట్ కు చెందిన బుచ్చిబాబుకు సమన్లు జారీ చేసింది. రేపు ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చింది.రాబిన్ డిస్ట్రలరీస్ కు చార్టెడ్ అకౌంటెంట్ గా బుచ్చిబాబు పనిచేస్తున్నారు. రామచంద్ర పిళ్లైతో పాటు పలువురికి బుబ్చిబాబు సీఏగా ఉన్నారు.
సెప్టెంబర్ 16,17న దోమలగూడలోని సీఏ గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించింది. 23 గంటల పాటు జరిపిన సోదాల్లో పలు కంపెనీలకు చెందిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.