
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ముమ్మాటికి హత్యేనని సీబీసీఎన్‌సీ(నార్తర్న్ సర్కార్స్ బాప్టిస్ట్ చర్చ్‌ల కన్వెన్షన్) ట్రస్ట్ ఇండియా చైర్మన్ ముత్తాబత్తుల రత్నకుమార్ ఆరోపించారు. ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. '
బుధవారం (April 2) ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు న్యాయం చేయాలని కోరారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ త్వరగా వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడా పునరావృతం కాకుండా కేంద్రం చూడాలన్నారు.