నీట్ పేపర్ లీక్ కేసులో.. సీబీఐ తొలి అరెస్ట్. 

నీట్ పేపర్ లీక్ కేసులో.. సీబీఐ తొలి అరెస్ట్. 

నీట్ పేపర్ లీక్ కేసులో మొదటిసారి నిందితులను అరెస్ట్ చేసింది సీబీఐ. బీహార్ లోని పాట్నాలో నీట్ పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడు మనీష్ ప్రకాష్ తోపాటు మరో నిందితుడు ఆశుతోష్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ చెప్పిన వివరాల ప్రకారం..మనీస్ ప్రకాష్ విద్యార్థులను తన కారులో తీసుకెళ్లిన ట్లు తెలుస్తోంది. దాదాపు 24 మంది విద్యార్థులకు లీకైన్ పేపర్ ను అందించినట్లు తెలుస్తోంది. ఈ పేపర్ ను ప్రిపేర్ అయ్యేందుకు ఖాళీ ఉన్న స్కూళ్లను వినియోగిం చుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆశుతోష్ విద్యార్థులకు వసతి కల్పించారు. 

గురువారం (జూన్ 27) మనీష్ ప్రకాష్, ఆశుతోష్ లను విచారణకు పిలిచిన సీబీఐ అధికారులు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటన లో మొత్తం ఆరు ఎఫ్ ఐఆర్ ను నమోదు చేసింది సీబీఐ. సీబీఐ అరెస్ట్ కు ముందు బీహార్, మహారాష్ట్ర , ఢిల్లీలో కూడా కొంతమందిని పోలీసులు అదుపుపలోకి తీసుకు న్నారు. పరీక్షకు ఒక రోజు ముందు తాను , మరికొంత మంది కలిసి ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు తెలుస్తోంది. 

మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ .. నీట్ యూజీ మెడికల్ కోర్సులకు ఎగ్జామ్ కండక్ట్ చేసింది. దాదాపు24 లక్షల మంది విద్యార్థులు నీట్ యూపీ 2024 పరీక్షకు హాజర య్యారు. అయితే ఫలితాలను షెడ్యూల్ కంటే 10 రోజుల ముందే జూన్ 4 న ప్రకటించారు. ఈ క్రమంలో నీట్ యూపీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందని ఆరోపణలతో దేశ వ్యాప్తంగా నిరసనలు  వెల్లువెత్తాయి. 

దీంతో 15 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపారు. దీంతో నిరసనలు మరింత పెరిగాయి. పేపర్ లీక్ విషయం ఎన్టీఏపై సుప్రీంకోర్టుతో సహా కింది కోర్టుల్లో కూడా పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. నీట్ పేపర్ లీక్ కేసులో ఎన్టీఏ డైరెక్ట్ర ర్ ను తప్పించారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగు తోంది. గురువారం (జూన్ 27) పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము .. న్యాయమైన విచారణకు ప్రభుత్వం కట్టుబడి ఉంద న్నా రు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. 

మరోవైపు గురువారం ప్రతిపక్షాలు పార్లమెంట్ లో నిరసనలు తెలిపాయి. ఇండియా కూటమి ఆధ్వర్యంలో పార్లమెంట్ సెషన్ లో ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు సిద్దమయ్యాయి.జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ యువజన సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తుంది.