
కోల్ కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలి అత్యాచార కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరగలేదని మార్చి 28న కోల్ కతా హైకోర్టుకు నివేదిక ఇచ్చింది.
సీబీఐ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ రాజ్‌దీప్ మజుందార్ శుక్రవారం (మార్చి 28, 2025) జస్టిస్ తీర్థంకర్ ఘోష్‌తో మాట్లాడుతూ.. ఆగస్టు 9, 2024 న సామూహిక అత్యాచార ఘటన స్థలంలో అందుబాటులో ఉన్న డీఎన్ఏ శాంపిల్స్ తో టెస్టులు నిర్వహించారు. దాదాపు 14 మంది వైద్యుల బృందం ఈ టెస్ట్ ఫలితాలను పరిశీలించింది. సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని నిర్ధారించింది. డీఎన్ ఏ ఆధారంగా దోషి సంజయ్ రాయ్ ప్రమేయం మాత్రమే ఉంది అని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అసలు కేసు ఏంటంటే..?
2024, ఆగస్ట్ 9వ తేదీన కోల్‌కత్తాలోని ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసింది అదే ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్‌గా పని చేసే సంజయ్ రాయ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు 2025, ఆగస్ట్ 10న నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
►Also Read : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్
ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో కోల్కత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టింది. మొత్తం 120 మంది సాక్ష్యులను విచారించిన సీబీఐ.. బలమైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించింది. నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ సైతం నిర్వహించింది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా సీబీఐ కోర్టుకు బలమైన ఆధారాలు సమర్పించింది. సీబీఐ సాక్ష్యాల ఆధారంగా సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చింది.