నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై కొరడా

నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై కొరడా

న్యూఢిల్లీ: నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఈ నెల 16 నుంచి  పన్ను అధికారులు రెండు నెలల పాటు స్పెషల్ డ్రైవ్‌‌ను నిర్వహించనున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్​డైరెక్ట్​ ట్యాక్సెస్​ అండ్​ కస్టమ్స్ ( సీబీఐసీ) తెలిపింది.  గతేడాది మేలో జరిగిన తొలి డ్రైవ్‌‌లో రూ. 24 వేల కోట్లకు పైగా జీఎస్‌‌టీ ఎగవేతతో దాదాపు 22 వేల నకిలీ రిజిస్ట్రేషన్‌‌లను గుర్తించామని తెలిపింది  . 

కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులతో కూడిన నేషనల్ కో–ఆర్డినేషన్ కమిటీ వీరిపై చర్యలు తీసుకుంటుంది.   స్పెషల్ డ్రైవ్ కింద జీఎస్టీ నెట్‌‌వర్క్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్‌‌మెంట్, సీబీఐసీ సమన్వయంతో పనిచేస్తాయి.