చత్తీస్ గఢ్ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

చత్తీస్ గఢ్ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

రాయ్ పూర్: చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘెల్ ఇంట్లో బుధవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. రాయ్​పూర్, భిలాయ్​లోని ఆయన నివాసాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్​ చీటింగ్ కేసుకు సంబంధించి అధికారులు ఈ రెయిడ్స్ చేస్తున్నారు. అయితే,ఈ సోదాలపై మాజీ సీఎం బాఘెల్ స్పందించారు. 

కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన సమయంలో అధికారులు తన నివాసానికి వచ్చారని ఆయన తెలిపారు. బీజేపీ కుట్రలో భాగంగానే ఈ దాడులు చేశారని ఆరోపించారు. 2023లో చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనిపై రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం ఆయనపై కేసు నమోదు చేసింది.