ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఇంట్లో సీబీఐ సోదాలు

న్యూఢిల్లీ: కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. మాజీ మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపాల్ సంజయ్ వశిష్ట్  నివాసాల్లోను తనిఖీలు చేపట్టింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో రైడ్స్ చేసింది. ఆర్జీ కర్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటికే అవకతవకలకు సంబంధించి ఘోష్‌‌‌‌‌‌‌‌పై సీబీఐ పలు కేసులు నమోదు చేసింది. 

అందులో భాగంగానే ఈ చర్యలకు ఉపక్రమించింది. సందీప్ ఘోష్ తో పాటు సంజయ్ వశిష్ట్ ను ప్రశ్నించింది. ఆర్జీ కర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్ లోని సెమినార్ హాల్ లో ఆగస్టు 9న ట్రైనీ పీజీ డాక్టర్‌‌‌‌‌‌‌‌ పై రేప్, హత్య  జరిగింది. ఈ దారుణంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు తీరు దారుణంగా ఉందనే విమర్శలు రావడంతో కలకత్తా హైకోర్టు కేసును సీబీఐకి బదిలీ చేసింది. హత్యతో పాటు ఆర్థిక అవకతవకలపై పలు కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.