విశాఖలో భారీగా డ్రగ్స్ గుట్టురట్టు చేశారు అధికారులు. వైజాగ్ సీపోర్ట్ లో 25 వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఇంటర్ పోల్, సీబీఐ, కస్టమ్స్ అధికారులు. బ్రెజిల్ నుంచి విశాఖకు మిరియాలు పేరుతో డ్రెడ్ యేస్ట్, డ్రగ్ రవాణా చేస్తుండగా కంటైనర్ ను పట్టుకున్నారు. 25 కేజీల చొప్పున వెయ్యిబ్యాగుల్లో మొత్తం 25వేల కేజీల డ్రగ్స్ ను పట్టుకుని.. కంటైనర్ ను సీజ్ చేశారు అధికారులు. ఆపరేషన్ గరుడ పేరుతో ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారంతో ఆపరేషన్ సక్సెస్ చేసింది సీబీఐ.
డ్రగ్స్ కంటెయినర్‌ను బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టులో బుక్ చేసుకున్నారు. విశాఖపట్నంలోనే ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో డెలవరీ అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ ఆధారంగా కేసు నమోదు చేసింది సీబీఐ.