
బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు చెందిన జప్తు చేసిన ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరులోని సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. బుధవారం ఈ అక్రమాస్తుల కేసును న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ విచారించారు. ఫిబ్రవరి 14 , 15 తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. 2004నాటి అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు చెందిన చెన్నై పోయెస్ గార్డెన్లోని ఇల్లు, భూములు, ఆస్తులు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు జప్తు చేశారు. 2016లో జయలలిత మరణించడంతో కేసులు క్లోజ్ అయ్యాయి. జప్తు చేసిన ఆస్తులను ఇవ్వాలని ఆమె మేనకోడలు, మేనల్లుడు పిటిషన్ వేయగా.. తాజాగా సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.