
న్యూఢిల్లీ: డిమాండ్ నోటీస్ అందుకున్న మూడు నెలల తర్వాతనే జీఎస్‌టీ బకాయిల రికవరీ ప్రాసెస్‌ను అధికారులు ప్రారంభిస్తారని ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ఇక నుంచి ఈ ప్రాసెస్‌ను ప్రిన్సిపల్ కమిషనర్ లేదా కమిషనర్ లెవెల్ ట్యాక్స్ అధికారులు కూడా మొదలు పెట్టొచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) తెలిపింది.
సాధారణంగా జీఎస్‌టీ బకాయిల రికవరీ ప్రాసెస్‌ను సెంట్రల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ లేదా జ్యూరిస్‌డిక్షన్ డిప్యూటీ మొదలు పెట్టాలి. జీఎస్‌టీ చట్టం ప్రకారం, ఏదైనా వ్యక్తి ట్యాక్స్ ఆర్డర్‌లో పేర్కొన్న అమౌంట్‌ను మూడు నెలల్లో చెల్లించకపోతే, సంబంధిత ట్యాక్స్ అధికారి జీఎస్‌టీ రికవరీ ప్రాసెస్‌ను మొదలు పెట్టొచ్చు. మూడు నెలలకు ముందే జీఎస్‌టీ బకాయిలు చెల్లించాలని అధికారులు సంబంధిత వ్యక్తిని కోరొచ్చు. కానీ ఇందుకు గల కారణాన్ని రాత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. కాగా, కొంత మంది ట్యాక్స్ అధికారులు మూడు నెలల టైమ్ పీరియడ్ కాకముందే ట్యాక్స్ రికవరీ ప్రాసెస్‌ను మొదలు పెడుతున్నారని సీబీఐసీ పేర్కొంది