స్టూడెంట్స్ కు సీబీఎస్ఈ క్లారిటీ
న్యూఢిల్లీ: కరోనా కారణంగా స్టూడెంట్లపై భారం పడకూడదనే ఉద్దేశంతో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 9 నుంచి 12 తరగతుల వరకు సిలబస్ లో 30 శాతం తగ్గించింది. ఈ అకడమిక్ ఇయర్ కు సంబంధించి కొత్త సిలబస్ ను బుధవారం ప్రకటించింది. సెక్యులరిజం, ఫెడరలిజం, నేషనలిజం, సిటిజన్ షిప్, పెద్దనోట్ల రద్దు , డెమోక్రటిక్ రైట్స్ లాంటి చాప్టర్లను సిలబస్ నుంచి సీబీఎస్ఈ తొలగించింది. స్టూడెంట్లపై భారం పడకూడదనే సిలబస్ ను తగ్గించామని, ప్రధాన చాప్టర్లలో ఎలాంటి మార్పులు చేయలేదని హెచ్చార్డీ మినిస్ట్రీ అధికారులు తెలిపారు. తొలగించిన చాప్టర్లు ఇంటర్నల్ అసెస్ మెంట్, ఫైనల్ ఎగ్జామ్స్ లో రావని సీబీఎస్ఈ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
తప్పుపట్టిన బెంగాల్ సీఎం
సీబీఎస్ఈ నిర్ణయాన్ని పలువురు ఎకడమిషియన్లు, లీడర్లు తప్పుపట్టారు. ఎకడమిక్ ఆలోచనా ధోరణులపై రాజకీయ ప్రభావాలు పడడం దురదృష్టకరమని పలువురు విద్యావేత్తలు ఆవేదన వ్యక్తంచేశారు. సీబీఎస్ఈ నిర్ణయంపై బెంగాల్ సీఎం సీరియస్ అయ్యారు. ముఖ్యమైన పాఠాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించవద్దని హెచ్ఆర్డీ మినిస్ట్రీ, కేంద్రప్రభుత్వాన్ని ఆమె కోరారు.