సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2027 విద్యాసంవత్సరానికి గాను10,12 తరగతి బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 16 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు CBSE అధికారిక వెబ్ సైట్ cbse.gov.in ని సందర్శించి పరీక్షల తేదీల షీట్ PDF ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
ఎగ్జామ్స్ డేట్స్ తోపాటు సీబీఎస్ ఈ 10,12 వ తరగతి ఎగ్జామ్స్ మోడల్ పేపర్స్ ను కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మోడల్ పేపర్లను అధికారిక వెబ్‌సైట్ - cbseacademic.nic.inలో చూసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా మోడల్ పేపర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు తరగతి వారీగా సబ్జెక్టుల వారీ మోడల్ పేపర్ లింక్‌పై క్లిక్ చేసి పీడీఎఫ్ ఫార్మెట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
