10వ తరగతి, 12వ తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించి CBSE కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 10, 12 వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల్లో మార్కుల శాతం, గ్రేడ్ లు ఇవ్వబోమని సీబీఎస్ఈ ప్రకటించింది.
ఉన్నత విద్య, ఉద్యోగంలో మార్కుల శాతం అవసరమైతే అడ్మిషన్ పొందిన సంస్థ లేదా యజమాని ద్వారా గణన చేయవచ్చని సీబీఎస్ ఈ ఎగ్జామినర్ తెలిపారు. బోర్డు పరీక్షల్లో విద్యార్థుల శాతాన్ని లెక్కించే ప్రమాణాలపై స్పష్టత కోరుతూ వచ్చిన వివిధ అభ్యర్థనలకు ప్రతిస్పందనగా సీబీఎస్ ఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఎగ్జామినేషన్ బైలాస్ లోని అద్యాయం 7 లోని సబ్ సెక్షన్ 40.1(iii) ప్రకారం.. CBSE విద్యార్థులకు no aggregate segregation, differentiation or aggregation ఇవ్వరాదని పేర్కొంది.
అంతకుముందు సీబీఎస్ ఈ మెరిట్ జాబితాను విడుదల చేసే పద్దతిని తొలగించింది.. తాజా మార్కుల శాతం, గ్రేడ్ లు ఇవ్వబోమని తెలిపింది.