కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టిస్తోంది. నగర శివారులో ఎలుగుబంటి కనిపించింది. నిన్న రాత్రి టైంలో బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలో ఎలుగుబంటి కాలనీలోకి వచ్చింది. ఎలుగు బంటిని చూసిన స్థానికులు.. భయంతో పరుగులు పెట్టారు.
ఇవాళ ఉదయం ద్వారకా నగర్ లో మరో ఎలుగుబంటి కనిపించిందని చెబుతున్నారు స్థానికులు. ఎలుగుబంటి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఫారెస్ట్ సిబ్బందికి సమాచారమిచ్చినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. అయితే రెండు వేర్వేరా? లేక ఒకటేనా అన్నది తెలియాల్సి ఉంది.