ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టపై రామాలయం ముందు నుంచి జీవకోనేరు వరకు సీసీ రోడ్డు, షెడ్డు నిర్మాణ పనులకు సోమవారం శివరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భూమిపూజ చేశారు. అనంతరం కొత్తగా వచ్చిన ఏసీపీ గట్టు బస్వారెడ్డి గుట్టపైన శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
రామాలయం నుంచి జీవకోనేరు వరకు ఉత్సవ మూర్తులతో వరకు పల్లకీసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు. టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాయిబాబా గౌడ్, శివరాత్రి ఉత్సవ నిర్వహణ కమిటీ ప్రతినిధులు భారత్ గ్యాస్ సుమన్, పీసీ గంగారెడ్డి, కోడిగెల మల్లయ్య, గంగాదేవి రైస్ మిల్ సూరజ్ గుప్తా, కొంతం మంజుల మురళి, ప్రశాంత్ గౌడ్, జిమ్మి సంధ్య, హజారి సతీశ్, శ్రీనివాస్ చెందేషి, అలిశెట్టి నరేశ్, పొద్దుటూరి చరణ్ రెడ్డి, బట్టు శంకర్ పాల్గొన్నారు.