రూ.63లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

రూ.63లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

ఉప్పల్, వెలుగు: చిలుకానగర్ డివిజన్​ను అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెప్పారు. ఆదివారం డివిజన్​లోని ఈస్ట్ కల్యాణపురి కాలనీలో, బీరప్పగడ్డలో రూ.63 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దశలవారీగా చిలుకానగర్ డివిజన్​ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

సీసీ రోడ్డుతోపాటు సీవరేజ్​లైన్​పనులు చేపడతామన్నారు. కార్పొరేటర్ గీతాప్రవీణ్ మాట్లాడుతూ.. తాగు నీటిపైప్​లైన్​ను కొత్తది వేస్తామన్నారు. డివిజన్​కు నిధులు కేటాయించి సహకరిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.