ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) మ్యాచ్ లు జరగనున్నాయి. శుక్రవారం(మార్చి 1) న ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరగనుండగా, రోజుకు రెండు చొప్పున మార్చి 1 నుంచి 3 వరకు ఆరు మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. తొలిరోజు చెన్నై రైనోస్ vs భోజ్‌పురి దబాంగ్స్, తెలుగు వారియర్స్ vs పంజాబ్ ది షేర్ జట్లు తలడనున్నాయి. ఈ మ్యాచ్ లకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండిల్‌వుడ్‌కు చెందిన పలువురు సినీ తారలు హాజరుకానున్నారు.
ప్రారంభ ధర: 99 రూపాయలే
సీసీఎల్ మ్యాచ్ ల టికెట్ల ధర కనిష్టంగా రూ.99, గరిష్ఠంగా రూ. 499గా నిర్ణయించారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడాలనుకునేవారికి ఇదొక చక్కని అవకాశం. ప్రారంభ ధర రూ. 99 రూపాయలే కనుక ఎంచక్కా కుటుంబంతో కలిసి మ్యాచ్ లు వీక్షించవచ్చు. https://ticketgenie.in/Event/Celebrity-Cricket-League-2024 వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 2:00 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 6:30 గంటలకు ప్రారంభంకానున్నాయి.
ప్రతిరోజూ 10వేల మందికి ఫ్రీ ఎంట్రీ
సెలబ్రెటీల క్రికెట్ మ్యాచ్ లకు కళాశాల విద్యార్థులను ఉచితంగా అనుమతించనున్నారు. ప్రతి రోజు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. ఇంటర్, డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం. ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ మ్యాచ్‌లకు హాజరయ్యే వారి విద్యా సంస్థల నుండి విద్యార్థుల సంఖ్య మరియు పేర్లతో hca.ccl2024@gmail.com (HCA)కి ఇమెయిల్ పంపాల్సి ఉంటుంది. అలాగే, మ్యాచ్ లకు హాజరయ్యే విద్యార్థులు తమ గుర్తింపు కార్డులు వెంట పెట్టుకకెళ్ళాలి.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారతదేశంలో సిసిఎల్ మ్యాచ్‍లు సోనీ టెన్ 5 ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. అలాగే, డిజిటల్‌గా చూడాలనుకునేవారు జియో సినిమాయాప్ లో ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు.
మొత్తం 8 జట్లు:
- తెలుగు వారియర్స్ (కెప్టెన్: అక్కినేని అఖిల్)
- ముంబై హీరోస్
- కేరళ స్ట్రయికర్స్
- భోజ్‌పురి దబాంగ్స్
- బెంగాల్ టైగర్స్
- చెన్నై రైనోస్
- కర్ణాటక బుల్డోజర్స్
- పంజాబ్ ది షేర్