న్యూఢిల్లీ: ఫ్యూచర్ జెనరలి ఇండియా ఇన్సూరెన్స్‌లో 24.91 శాతం వాటాను , ఫ్యూచర్ జనరలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్‌లో 25.18 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతులు ఇచ్చింది.
వీటిలో దివాలా ప్రాసెస్ ఎదుర్కొంటున్న ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ వాటాలను దక్కించుకునేందుకు సెంట్రల్ బ్యాంక్ రిజల్యూషన్ ప్లాన్‌ను సబ్మిట్ చేసింది.