వరంగల్ జిల్లాలో జోరుగా సీసీఐ పత్తి కొనుగోళ్లు

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్​ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా కాటన్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (సీసీఐ)345.93 లక్షల క్వింటాళ్లు పత్తి కొనుగోళ్లు చేసిందని కాటన్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (సీసీఐ) చీఫ్​ జనరల్​ మేనేజర్​ అర్జున్​ దేవ్​ చెప్పారు.  గురువారం సీసీఐ చీఫ్​ జనరల్​ మేనేజర్​ మాట్లాడుతూ..  దేశ వ్యాప్తంగా 2024-– 2025వ పత్తి సీజన్​ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సీసీఐ ఎంఎస్​పీ ప్రభుత్వ మద్దతు ధర రూ.7165లు క్వింటాల్​ చొప్పన 345.93లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు.

 పత్తి ఉత్పత్తి చేసే రాష్ర్టాల్లో పత్తి రైతులందరికి సీసీఐ చివరి వరకు వచ్చే ఫెయిర్​ గ్రేడ్​ పత్తిని కొనుగోలు చేయడం కొనసాగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అన్నారు. పత్తి రైతులకు ఎమైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే వాట్సాప్ నంబర్​ 91 7718955728కి సందేశాలను పంపవచ్చని తెలిపారు.