న్యూఢిల్లీ: మార్కెట్‌లో వాట్సాప్‌కు ఉన్న ఆధిపత్యాన్ని తప్పుగా వాడుతుందనే ఆరోపణలపై మెటా ప్లాట్‌ఫామ్స్‌కు రూ.213.14 కోట్ల జరిమానాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించింది.
వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీని అమలు చేయడం, యూజర్ల డేటాను సేకరించి ఇతర మెటా కంపెనీలతో పంచుకోవడానికి సంబంధించి ఈ జరిమానా వేసింది. యాడ్స్‌కు సంబంధించి మెటా కంపెనీలతో డేటా షేర్ చేసుకోవద్దని వాట్సాప్‌ను సీసీఐ ఆదేశించింది.