ఎల్లప్పుడూ సినిమాలతో బిజీ బుజీ జీవితాన్ని గడిపే సినీ ప్రముఖులు మైదానంలో అడుగుపెట్టారు. సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) 10వ సీజన్ అట్టహసంగా ప్రారంభమైంది. శుక్రవారం(ఫిబ్రవరి 23) ముంబై హీరోస్ - కేరళ స్ట్రైకర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమైంది. తొలి పోరులో కేరళ స్ట్రైకర్స్‌పై.. ముంబై హీరోస్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో సిసిఎల్ టోర్నీ షెడ్యూల్ ఏంటి..? మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతున్నాయి..? లైవ్ స్ట్రీమింగ్ ఇందులో చూడాలి..? వంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ఈ ఏడాది సిసిఎల్ టోర్నీ తొలి భాగం విదేశా(షార్జా)ల్లో జరగనుండగా.. రెండో భాగం భారత్‌లో జరగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ మార్చి 17న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. భారత్‌లో హైదరాబాద్, చండీగఢ్, త్రివేండ్రం, వైజాగ్ నగరాలు సిసిఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
రౌండ్ రాబిన్ ఫార్మాట్
రాబిన్ రౌండ్ పద్ధతులో జరిగే ఈ టోర్నీలో లీగ్ దశలో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. లీగ్ దశ ముగిసేసరికి మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌లకు అర్హత సాధిస్తాయి. ఇక మ్యాచ్ ఫార్మాట్ విషయానికొస్తే.. టెస్టుల తరహాలో ప్రతి జట్లు 10 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లు ఆడతాయి. ఈ రెండు ఇన్నింగ్స్‌లు ముగిసే సమయానికి గరిష్టంగా పరుగులు చేసిన విజేతగా నిలుస్తుంది.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారతదేశంలో సిసిఎల్ మ్యాచ్‍లు సోనీ టెన్ 5 ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. అలాగే, డిజిటల్‌గా చూడాలనుకునేవారు జియో సినిమాయాప్ లో ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు.
జట్లు - కెప్టెన్లు
- తెలుగు వారియర్స్: అక్కినేని అఖిల్
- ముంబై హీరోస్: రితేష్ దేశ్‌ముఖ్
- కేరళ స్ట్రయికర్స్: కుంచాకో బోబన్
- భోజ్‌పురి దబాంగ్స్: మనోజ్ తివారీ
- బెంగాల్ టైగర్స్: జిషు సేన్‌గుప్తా
- చెన్నై రైనోస్: ఆర్య
- కర్ణాటక బుల్డోజర్స్: ప్రదీప్
- పంజాబ్ ది షేర్: సోనూ సూద్
సిసిఎల్ 2024 షెడ్యూల్
- ఫిబ్రవరి 23: ముంబై హీరోస్ vs కేరళ స్ట్రైకర్స్ (షార్జా)
- ఫిబ్రవరి 24: తెలుగు వారియర్స్ vs భోజ్‌పురి డబ్బాంగ్స్ (షార్జా)
- ఫిబ్రవరి 24: కేరళ స్ట్రైకర్స్ vs బెంగాల్ టైగర్స్ (షార్జా)
- ఫిబ్రవరి 25: చెన్నై రైనోస్ vs పంజాబ్ డి షేర్ (షార్జా)
- ఫిబ్రవరి 25: ముంబై హీరోస్ vs కర్ణాటక బుల్డోజర్స్ (షార్జా)
- మార్చి 1: చెన్నై రైనోస్ vs భోజ్‌పురి డబ్బాంగ్స్ (హైదరాబాద్)
- మార్చి 1: తెలుగు వారియర్స్ vs పంజాబ్ డి షేర్ (హైదరాబాద్)
- మార్చి 2: కర్ణాటక బుల్డోజర్స్ vs బెంగాల్ టైగర్స్ (హైదరాబాద్)
- మార్చి 2: తెలుగు వారియర్స్ vs కేరళ స్ట్రైకర్స్ (హైదరాబాద్)
- మార్చి 3: ముంబై హీరోస్ vs భోజ్‌పురి డబ్బాంగ్స్ (హైదరాబాద్)
- మార్చి 8: పంజాబ్ దే షేర్ vs బెంగాల్ టైగర్స్ (చండీగఢ్)
- మార్చి 9: బెంగాల్ టైగర్స్ vs భోజ్‌పురి డబ్బాంగ్స్ (చండీగఢ్)
- మార్చి 9: పంజాబ్ దే షేర్ vs ముంబై హీరోస్ (చండీగఢ్)
- మార్చి 10: తెలుగు వారియర్స్ vs కర్ణాటక బుల్డోజర్స్ (త్రివేండ్రం)
- మార్చి 10: చెన్నై రైనోస్ vs కేరళ స్ట్రైకర్స్ (త్రివేండ్రం)
- మార్చి 15: క్వాలిఫైయర్ 1: 1 vs 2 (వైజాగ్)
- మార్చి 15: ఎలిమినేటర్ 1: 3 vs 4 (వైజాగ్)
- మార్చి 16: క్వాలిఫైయర్ 2: Q1లో ఓడిన జట్టు vs E1 విజేత (వైజాగ్)
- మార్చి 17 ఫైనల్: క్వాలిఫైయర్ 1 విన్నర్ vs 2 క్వాలిఫైయర్ 2 విన్నర్ (వైజాగ్)