
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ ఉన్న సమయంలో వచ్చిన పెండింగ్ అప్లికేషన్లను ప్రస్తుత వర్క్‌ఫ్లో ప్రకారం సమీక్షించి, అప్రూవ్చేయడం లేదా తిరస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 14 నుంచి వచ్చిన కొత్త అప్లికేషన్లను తెలంగాణ భూభారతి చట్టం, 2025 ప్రకారం పరిష్కరించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అప్లికేషన్‌ను ఏదైనా కారణంతో రిజెక్ట్చేస్తే.. కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. అదే సమయంలో దరఖాస్తుదారులకు ఏ ఆధారంతో సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారో అందు కు అవకాశం ఇవ్వాలన్నారు. కలెక్టర్లు కింది స్థాయి అధికారులకు సమాచారం అందించాలన్నారు.