సీసీఎంబీలో పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ ప్రోగ్రామ్

సీసీఎంబీలో పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ ప్రోగ్రామ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జనవరి 2024)లో ఎంట్రెన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

పరిశోధనాంశాలు: సెల్ బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, జెనోమిక్స్, డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటల్ బయాలజీ, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ, కన్జర్వేషన్ బయాలజీ, ఎకాలజీ, ప్రొటీన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, బయాలజీ ఆఫ్ మాక్రోమోలిక్యుల్స్, బయాలజీ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇమ్యునాలజీ, ఎపిజెనెటిక్స్, క్రోమాటిన్ బయాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్.

అర్హత: కనీసం 55% మార్కులతో సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూజీసీ, డీబీటీ, డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ నుంచి వ్యాలిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా డీబీటీ- బీఈటీ, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఫెలోషిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్హత పొంది ఉండాలి.

సెలెక్షన్: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయి ఫెలోషిప్ కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష అక్టోబర్ 8న నిర్వహించనున్నారు. వివరాలకు www.ccmb.res.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.