
కోచింగ్ సెక్టార్ లో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు కోచింగ్ సెంటర్లకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) వార్నింగ్ నోటీసులు జారీ చేసింది. కోంచిగ్ సెంటర్లు CCPA మార్గదర్శకాలను ఉల్లంఘించి IIT, JEE, NEET ఫలితాలు ప్రకటన తర్వాత తప్పుదోవ పట్టించే యాడ్స్ ఇస్తున్నాయని నిర్ధారించింది. అంతేకాదు కోచింగ్ సెంటర్ల నిర్వహణ, రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నా ఫీజు చెల్లించకపోవడం, అభ్యర్థులకు సరైన వసతులు కల్పించకపోవడం నిర్వహణ లోపాలను గుర్తించింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకుండా కోచింగ్ సెక్టార్ లో 2019 వినయోగదారులు రక్షణ చట్టం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని CCPA అన్ని కోచింగ్ సెంటర్లకు వార్నింగ్ ఇచ్చింది. పరీక్షలు రాయకముందే ఉత్తీర్ణత, సక్సెస్ వంటి హామీలు ఇవ్వకూడదని కోచింగ్ సెంటర్లకు సూచించింది.కోచింగ్ సెంటర్లు ఇచ్చే ప్రకటనల్లో విద్యార్థి పేరు, ర్యాంక్, కోర్సు వంటి కీలక వివరాలు స్పష్టంగా వెల్లడించాలని కోరింది. విద్యార్థులను తప్పుదారి పట్టకుండా చూసుకోవడానికి డిస్ క్లైమర్లను తప్పకుండా ప్రకటనల్లో చూపించాలని కోరింది.
►ALSO READ | ఇదెక్కడి న్యాయం సార్: గర్ల్ ఫ్రెండ్ ని కలిసేందుకు వెళ్లాలంటే యూఎస్ వీసా రిజెక్ట్ చేస్తారా..