సీసీఎస్ సీఐ సుధాకర్ కేసులో ట్విస్ట్.. ఏసీబీ విచారణకు హాజరైన సీసీఎస్ ఏసీపీ

సీసీఎస్ సీఐ సుధాకర్ కేసులో ట్విస్ట్.. ఏసీబీ విచారణకు హాజరైన సీసీఎస్ ఏసీపీ

లంచం కేసులో అరెస్ట్ అయిన  సిసిఎస్ సిఐ సుధాకర్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది.  ఈ కేసులో సీసీఎస్ ఏసీపీ  రామ్ రెడ్డి ని విచారణకు పిలిచింది ఏసీబీ. లంచం కేసులో ఏసీపీ రామ్ రెడ్డి పాత్ర పై విచారిస్తోంది.  ఈ కేసులో ఏసీపీ రామ్ రెడ్డి పాత్ర ఉంటే ఏసీబీ అధికారులు అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 

ఓ కేసు విషయంలో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా జూన్ 13న సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ను  ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...   బోయిన్ పల్లికి  చెందిన శ్రీ మణి రంగస్వామిపై సీసీఎస్ లో ఓ కేసు నమోదు అయింది. శ్రీ మణిరంగస్వామి  కేసును విచారిస్తున్న డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ టీం 7 లో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ చామాకురి సుధాకర్ కేసును అతనికి అనుకూలంగా క్లోజ్  చేసేందుకు రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేశాడు.  తొలి విడతగా రూ.5 లక్షలు అతని నుండి తీసుకున్నాడు. 

2024 జూన్ 13వ తేదీ గురువారం రోజున రెండో విడతగా రూ.3 లక్షలు సీఐకు సీసీఎస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్లేస్ లో అతని కారులో పెడుతున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అయితే ఏసీబీ అధికారులను చూసి , పరారు కావడానికి యత్నించిన సుధాకర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి మూడు లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు , అతనిపై కేసు నమోదు చేసి , నాంపల్లి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.