క్రిమినల్స్ వేటలో సీసీ కెమెరాలే కీలకం

క్రిమినల్స్ వేటలో సీసీ కెమెరాలే కీలకం
  • సీసీ టీవీ కెమెరాలు క్రిమినల్స్​ను  పట్టేస్తున్నయ్
  • ఇన్వెస్టిగేషన్‌లో సీసీ టీవీ కెమెరాలదే కీ రోల్‌
  • ఫార్మసీ స్టూడెంట్ రేప్ డ్రామాను పట్టించినవీ ఇవే
  • గతేడాది 4,490 కేసులు ట్రేస్ చేసిన పోలీసులు

“ఇటీవల మలక్ పేట్ లో పేరెంట్స్ పక్కనే పడుకున్న రెండేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు.  సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక్క రోజులోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు’’.

“ ఆరురోజుల కిందట ఘట్​కేసర్​లో జరిగిన ఫార్మసీ స్టూడెంట్​ కిడ్నాప్, ఆత్యాచారం ఫేక్​అని సీసీ టీవీ ఫుటేజ్​లే తేల్చేశాయి.’’

హైదరాబాద్, వెలుగు:  కేసు ఏదైనా కానీ.. క్రైమ్​ ఇన్వెస్టిగేషన్ లో సీసీ టీవీ కెమెరాలు కీ రోల్ పోషిస్తున్నయ్ . పక్కా ఎవిడెన్స్ తో అసలు నేరగాళ్లను పట్టిస్తున్నయ్. పోలీసుల నుంచి తప్పించుకున్నా కూడా సీసీ టీవీ నిఘా నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నరు. సీసీ టీవీ కెమెరాలు వచ్చిన తర్వాత  కేసులను ట్రేస్ చేయడం పోలీసులకు ఈజీ అయ్యింది. మొన్నటి బీ ఫార్మసీ స్టూడెంట్స్ కిడ్నాప్, రేప్ డ్రామా కేసును రెండు రోజుల్లోనే పోలీసులు చేధించేందుకు సీసీ టీవీ కెమెరాలే హెల్ప్ చేశాయి. లేదంటే ఈ కేసులో అమాయకులైన ఆటో డ్రైవర్లు నిందితులుగా మారేవారు.

పోలీసులకు థర్డ్​ఐగా..

ఒక్క ఫార్మసీ స్టూడెంట్ కేసునే కాదు. యాక్సిడెంట్లు, మర్డర్లు, కిడ్నాప్ లు, గొడవలు ఇలా ఏ కేసు అయినా ఆయా ఘటనలకు సీసీ టీవీ కెమెరాలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నయ్. పోలీసులకు థర్డ్ ఐ గా పని చేస్తున్నయి.  సిటీలో  సీసీ టీవీ కెమెరాల కారణంగా క్రిమినల్స్​తప్పించుకోవడమనేది అసాధ్యమైంది.  సీన్ ఆఫ్ అఫెన్స్ ను హై డెఫినేషన్ తో కెమెరాలు క్యాప్చర్ చేస్తున్నాయి. దీంతో అమాయకులపై నేరాలు మోపినా కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్ అసలు నేరస్తులెవరో బయటపెడుతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు వీటిపైనే ఆధారపడి కేసులను ట్రేస్ చేస్తున్నారు. మిస్టరీ కేసులు కూడా ఒకటి, రెండు రోజుల్లోనే తేలిపోతున్నయ్. ఒక్క సీసీ టీవీ కెమెరా వందమంది పోలీసులు చేస్తున్న డ్యూటీని చేస్తున్నయ్.

గతేడాది 4, 490 కేసులు ట్రేస్

గతేడాది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు 4, 490 కేసులను ట్రేస్ చేశారు. మొబైల్ లోకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు ఉండడంతో క్రిమినల్స్​ఇన్వెస్టిగేషన్ టైమ్ లో అబద్దాలు చెప్పినా ఇట్టే దొరికిపోతున్నరు.  ఎవిడెన్స్, డిజిటల్ వీడియో రికార్డింగ్ లు ఉండడంతో కేసుల విచారణ కూడా తొందరగా పూర్తై  శిక్ష పడుతోంది. క్రైమ్ చేసిన వ్యక్తి సిటీలో ఎక్కడున్నా సరే సీసీ టీవీలు క్యాప్చర్ చేస్తున్నాయి. దీంతో పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుంటున్నారు.

క్రైం చేయాలంటేనే..

గ్రేటర్ పరిధిలో 6 లక్షల 10 వేలకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. సిటీలో క్రైం చేసిన వ్యక్తి తప్పించుకునేందుకు వీలులేకుండా ప్రతి ఏరియాను సీసీ టీవీ కెమెరాలు కవర్ చేస్తున్నాయి. దీనికి తోడు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు ఏర్పాటు చేసినవి ఇన్వెస్టిగేషన్ కు హెల్ప్ అవుతున్నాయి. దీంతో క్రైం చేయాలంటేనే భయపడుతున్నారు. కచ్చితమైన ఆధారాలతో దొరికిపోతామనే టెన్షన్​ నిందితుల్లో ఉంటుంది. ఈ ఎఫెక్ట్ తో చాలా వరకు నేరాల సంఖ్య తగ్గింది. యాక్సిడెంట్స్, హిట్ అండ్ రన్ కేసుల్లో చాలా వరకు సీసీ టీవీల ద్వారానే ఇన్వెస్టిగేషన్​ కంప్లీట్ అవుతుంది.

సిటీకి 16 వ ర్యాంక్

ప్రపంచంలోనే టాప్ 20 మోస్ట్ సర్వైలెన్స్ సిటీల్లో హైదరాబాద్ 16వ ర్యాంక్​లో ఉంది.  ప్రతి 1000 మందికి ఓ సీసీ టీవీ కెమెరాల కౌంటింగ్ లోనూ చైనా, ఇంగ్లాండ్ లోని టాప్ సిటీస్ తో పోటీ పడుతోంది. దేశంలోనే ఏ సిటీలో లేని విధంగా హైదరాబాద్ లో 6 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఫుటేజ్ ముందు పెట్టి క్వశ్చన్ చేశాం

ఫార్మసీ స్టూడెంట్‌ అందరినీ రాంగ్‌ ట్రాక్‌లోకి తీసు కెళ్లింది. ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా 109 సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ కలెక్ట్ చే శాం. రాంపల్లి నుంచి అన్నోజి గూడ వరకు కలెక్ట్‌ చేసిన ఫుటేజ్‌ ముందు పెట్టి క్వశ్చన్ చేశాం.  దీంతో ఫేక్ కిడ్నాప్‌, రేప్ డ్రామా అని ఒప్పుకుంది. సీసీ టీవీ కెమెరాలు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్​ వచ్చేవి.

– మహేశ్‌ భగవత్, సీపీ, రాచకొండ కమిషనరేట్

For More News..

సర్కార్ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు.. ట్రీట్‌‌మెంట్‌‌, మెడిసిన్లు ఫ్రీ

బంజారా బిర్యానీకి ఫస్ట్ ప్రైజ్

స్కాలర్​షిప్​ అప్లికేషన్లకు మార్చి 31 వరకు చాన్స్