మహబూబ్‌నగర్ లో సీసీ కెమెరాల ఏర్పాటుకు లక్ష విరాళం

మహబూబ్‌నగర్ లో సీసీ కెమెరాల ఏర్పాటుకు లక్ష విరాళం

పాలమూరు, వెలుగు: మహబూబ్‌నగర్ టౌన్‌లో ప్రజల భద్రతను పెంచేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డి. జానకి తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు బుధవారం కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మద్ది అనంత రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి లక్ష రూపాయల చెక్కును మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకికి అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.