ఢిల్లీలో ఈదురుగాలుల బీభత్సం..కూలిన ఇంటిగోడ..మహిళ మృతి.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్

ఢిల్లీలో ఈదురుగాలుల బీభత్సం..కూలిన ఇంటిగోడ..మహిళ మృతి.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్

ఢిల్లీలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన ఈదురుగాలులతో సిటీలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. మధు విహార్ ప్రాంతంలో  నిర్మాణంలో ఉన్న ఆరంతస్థుల భవనం గోడ కూలి స్థానికులపై పడింది. దీంతో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై సిమెంట్ రాళ్లు పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఈదురు గాలులకు గోడకూలి పడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో మధు విహార్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆరంతస్తుల భవనం గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.ఢిల్లీలో సంభవించిన ఈదురు గాలులతో విద్యుత్  అంతరాయం ఏర్పడింది.విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో సిటీలో  చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబూషన్ అధికారులు తెలిపారు.

Also Read : అసోంలోనూ వక్ఫ్ వ్యతిరేకంగా నిరసనలు

శనివారం నాడు కూడా ఢిల్లీలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీగా దుమ్ము తో కూడిన ఈదురుగాలులు సంభవించడంతో ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 450 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో శుక్రవారం కూడా  విమానాల రాకపోకలకు దుమ్ము తుఫాను అంతరాయం కలిగింది. ఉత్తర ఢిల్లీలో అకస్మాత్తుగా వాతావరణం మారిన తర్వాత ఎయిర్ ఇండియా తమ ప్రయాణీకులకు అలెర్ట్ జారీచేసింది. భారీ ఉరుములు ,ఈదురు గాలులు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో విమానాల రాకపోకలను ప్రభావితం చేశాయి. ఢిల్లీ నుండి వచ్చే కొన్ని ఎయిర్ ఇండియా విమానాలు దారి మళ్లించారు కొన్ని ఆలస్యం నడిచాయి.