
నవాబుపేట, వెలుగు: మండలంలోని యన్మన్గండ్ల గ్రామ మీపంలోని దేవరగుట్టపై సంచరిస్తున్న చిరుతల కదలికలు తెలుసుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వారం రోజులుగా పదికి పైగా కుక్కలను, శుక్రవారం తెల్లవారుజామున కోస్గి కిష్టయ్య ఆవుల షెడ్డులో నుంచి లేగదూడను ఎత్తుకెళ్లడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు చిరుతలను బంధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దేవరగుట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
అనంతరం గ్రామస్తుల సాయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుతల కదలికలు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మూమెంట్స్ తెలిసిన అనంతరం బోన్లను ఏర్పాటు చేసి చిరుతలను బంధించి తరలిస్తామని ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపారు. గ్రామస్తులు, రైతులు గుట్ట పరిసరాల్లోకి వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.