వీడికేం పోయేకాలం : పెళ్లాన్ని కొట్టి కొట్టి చంపిన మాజీ మంత్రి

ఖజకిస్తాన్ మాజీ మంత్రి కువాండిక్ బిషింబాయేవ్(44) తన భార్యను కొట్టి చంపాడు. గత కొద్దికాలంగా ఈ విషయం ఆదేశంలో చర్చనీయాంశమైంది. సాల్టానాట్ నుకెనోవా(31)ని 2023 నవంబర్‌లో ఆమె భర్త బంధువు రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఈ జంట దాదాపు ఒక రోజంతా ఉన్నారు. అయితే వారి మధ్య ఏం అయిదో తెలియదు కానీ.. బిషింబాయేవ్ అతని భార్య సల్తానాట్ నుకెనోవాను కొట్టాడు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా కోర్టులో సమర్పించారు.

8 గంటల ఉన్న ఆ వీడియోలో బిషింబాయేవ్ తన భార్యను జుట్లు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లి విపరీతంగా కొట్టాడు. పదే పదే కాలితో తన్నుతూ తీవ్రంగా దాడి చేశాడు. దెబ్బలకు తాలలేక ఆమె బాత్ రూంలోకి వెళ్లి దాక్కుంది. అయినా సరే అతను తలుపు పగలగొట్టి, ఆమెను బయటకు లాక్కొచ్చి చావబాదాడు. 

బిషింబాయేవ్ రెస్టారెంట్ లో కెమెరాలు రూంకి అతని భార్యని తీసుకెళ్లి మరీ కొట్టాడు. ఆమె ముక్కు ఎముక ఒకటి విరిగింది. ముఖం, తల, చేతులపై అనేక గాయాలైయాయి. సల్తానాట్ మెదడుకు గాయమై స్పాట్ లోనే చినిపోయిందని డాక్టర్లు తేల్చి చెప్పారు. బిషింబాయేవ్‌ చిత్రహింసలు పెట్టి తన భార్య చావుకు కారణమైనందుకు కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ప్రస్తుతం ఈ కేసు ఖజకిస్తాన్ సోషల్ మీడియాలో హాట్ టాపింక్ గా మారింది.