ఎమ్మెల్యే వివేక్​ చేతుల మీదుగా సీడీ ఆవిష్కరణ

కోల్​బెల్ట్, వెలుగు: మాల మహానాడు ఆఫ్​ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన ‘తెలంగాణ మాల మహానాడు’ పాటల సీడీని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్​జి.వివేక్​ వెంకటస్వామి ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. హైదరాబాద్​లోని ఎమ్మెల్యే నివాసంలో సీడీని రిలీజ్​చేసిన అనంతరం సంఘం బాధ్యులతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

కొత్తగా ఎన్నికైన జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి, రాష్ట్ర కమిటీ బాధ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో వైస్​ ప్రెసిడెంట్​ ముత్తమల్ల పుల్లయ్య, సెక్రటరీ కాసర్ల యాదగిరి, స్టేట్ ​ప్రెసిడెంట్ ​జూపాక సుధీర్, సోగాల కిష్టయ్య, ఎరుకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.