మహిళలు రిస్క్​ తీసుకోవాలె: ఐడబ్ల్యూఎన్ తెలంగాణ వైస్​ చైర్మన్​ హేమ

మహిళలు రిస్క్​ తీసుకోవాలె: ఐడబ్ల్యూఎన్ తెలంగాణ వైస్​ చైర్మన్​ హేమ

న్యూఢిల్లీ: కంపెనీల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే మహిళా ఉద్యోగులు సవాళ్లను ఎదుర్కోవాలని, రిస్క్​ తీసుకోవాలని నిపుణులు సూచించారు. వ్యాపార సంస్థల్లో మహిళలు ఉన్నతస్థానాలను చేపట్టడానికి ఉన్న సమస్యలపై చర్చించడానికి సీడీకే గ్లోబల్​, సీఐఐ ఇండియన్​ విమెన్ ​నెట్​వర్క్​(ఐడబ్ల్యూఎన్​)తో కలసి హైదరాబాద్​లో శనివారం ప్యానెల్​ డిస్కషన్​నిర్వహించాయి. వ్యాపార రంగంలో వారికి ఉన్న అవకాశాలపై, అవరోధాలపై ఈ సందర్భంగా నిపుణులు చర్చించారు. 

ఐడబ్ల్యూఎన్ తెలంగాణ వైస్​–చైర్మన్​ హేమా శ్రీనివాస్​ మాట్లాడుతూ అంతర్జాతీయంగానూ సీనియర్​ లీడర్షిప్ ​స్థానాల్లో మహిళలకు సమాన అవకాశాలు దక్కడం లేదన్నారు. ఇండియాలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని విమర్శించారు. రిస్క్​ తీసుకోవడానికి ఇష్టపడకపోవడం, పక్షపాత కారణంగా ఇలా జరుగుతోందని చెప్పారు. 

ఈ సమస్యలను పరిష్కరించాలని, మహిళలు ఎదిగేందుకు తగిన వాతావరణాన్ని సృష్టించాలని అన్నారు. ఐబీఎం ఎగ్జిక్యూటివ్​ పార్ట్​నర్​ లక్ష్మీనాయర్​ మాట్లాడుతూ మహిళలు రిస్క్​ తీసుకోవడానికి వెనకడుగు వేయవద్దని, కెరీర్​కోసం స్పాన్సర్లను, మెంటార్లను సంపాదించుకోవాలని సూచించారు.