కోస్గి, వెలుగు: పట్టణంలో బ్యూటిఫికేషన్ పనులను త్వరగా ప్రారంభించాలని సీడీఎంఏ డైరెక్టర్ గౌతం అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి కోస్గి పట్టణంలో పర్యటించి అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.416.54 కోట్లు సుందరీకరణ కోసం ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. పార్కులు, షటిల్ కోర్టు, శివాజీ కూడలి సుందరీకరణ, చెరువుల అభివృద్ధి పనులు స్టార్ట్ చేయాలన్నారు.
ట్రైనీ కలెక్టర్ గరిమ నరుల, కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చికినె శశిధర్ ఉన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలిజిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, రోగులకు సకాలంలో వైద్యం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కోస్గి కమ్యూనిటీ ఆసుపత్రిని తనిఖీ చేసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మందుల కొరత రాకుండా ఇండెంట్ పెట్టాలని, రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యసేవలు అందించాలన్నారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్, లైబ్రరీ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ ఉన్నారు.