యుద్ధానికి మేం రెడీ..రక్షణ మంత్రితో CDS అనిల్ చౌహన్

యుద్ధానికి మేం రెడీ..రక్షణ మంత్రితో CDS అనిల్ చౌహన్

భారత్, పాక్ మధ్య యుద్దానికి మూహూర్తం ఖరారయినట్లు తెలుస్తోంది. నిన్న యుద్దానికి మేం సిద్దం అంటూ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన కొన్ని గంటల్లోనే తాజాగా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ కూడా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అవడం..పాక్ తో యుద్ధం మొదలైనట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఆదివారం (ఏప్రిల్ 27) చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ (CDS) జనరల్  అనిల్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ప్రస్తుత కాశ్మీర్ పరిస్థితిపై, యుద్దం వస్తే తాము సిద్ధంగా ఉన్నామని రక్షణమంత్రికి తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు  పహల్గామ్‌లో దాడి తర్వాత ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత సైన్యం జమ్మూకాశ్మీర్ మొత్తల జల్లెడ పడుతోంది. పలువురు ఉగ్రమూకల  ఇళ్లను నేలమట్టం చేసింది. ఉగ్రవాదులను అంతమొందించేవరకు ఆపరేషన్ కొనసాగుతుందని ప్రకటించింది. 

పహల్గాం ఉగ్రదాడి తర్వాత అటు అరేబియా సముద్రంలో కూడా భారత యుద్దనౌకలు మోహరించాయి. పలు మిస్సైల్స్ టెస్ట్ చేసి యుద్దానికి సిద్దంగా ఉన్నట్టు ప్రకటించాయి.ఇప్పటికే సింధుజలాలను రద్దు చేసి పాక్ ను ఇరకాటంలో పెట్టిన భారత్..తాజా పరిమాణాలతో  పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. భారత్ చర్యలకు భయపడిన పాక్..తాను కూడా సైనిక విన్యాసాలు మొదలుపెట్టింది. 

►ALSO READ | ఢిల్లీ మురికివాడల్లో అగ్ని ప్రమాదం..మంటల్లో 800 గుడిసెలు..భయంతో జనం పరుగులు

మరోవైపు పాక్ నేతలు తమ వక్రబుద్దిని చూపిస్తున్నారు. సింధు జలాలను నిలిపివేస్తే..భారత్ పై అణుబాంబులు ప్రయోగిస్తామని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. తమ దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి..అవి భారత్ పై వేస్తామంటూ పాక్ నేత బిలావల్ భుట్టో నోటి దురుసును ప్రదర్శించారు. 

భుట్టో వ్యాఖ్యలకు అసోం సీఎం హేమంత బిస్వశర్మ తీవ్రంగా స్పందించారు. పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకోకుండా ఎవరూ అడ్డుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఉగ్రవాదులను , వారికి సాయం చేస్తున్న వారికి వెతికి పట్టీ మరీ శిక్షిస్తుందని అన్నారు.