
గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చూస్తున్న విషయం తెలిసిందే. స్టాక్ మార్కెట్ల నష్టాలతో కొత్త ఇన్వెస్టర్లు స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఫిబ్రవరిలో తగ్గిన డీమాట్ అకౌంట్లే ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరిలో కొత్త డీమ్యాట్ ఖాతాలు భారీగా తగ్గాయి.
ఫిబ్రవరిలో CDSL, NSDLలో మొత్తం 19.04 కోట్ల ఖాతాలు నమోదు అయ్యాయి. ఇవి గత ఫిబ్రవరితో పోలిస్తే 48శాతం తక్కువ. మార్కెట్ అస్థిరత కారణంగా ఈ తగ్గుదల కనిపిస్తుంది. ఫిబ్రవరిలో కొత్తగా కేవలం 22.6 లక్షల డీమ్యాట్ ఖాతాలు మాత్రమే తెరుచుకున్నాయి.2023 మే తర్వాత ఇదే అత్యల్పం.
ALSO READ | Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్.. 5శాతం నష్టపోయిన విప్రో, ఇన్ఫోసిస్.. కారణం ఇదే
ఫిబ్రవరిలో డీమ్యాట్ ఖాతాల నమోదు 21 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఫిబ్రవరి నెలలో కేవలం 22.60లక్షల అకౌంట్లు మాత్రమే ఓపెన్ చేయబడ్డాయి. CDSL NSDL డేటా ప్రకారం వాటి మొత్తం సంఖ్య 19కోట్ల మార్కును దాటినప్పటికీ.. సెప్టెంబర్ చివరి నుండి స్టాక్ మార్కెట్లు దిద్దుబాటు దశలో ఉండటంతో నెలవారీ కొత్త డీమ్యాట్ ఖాతాలు కూడా తగ్గాయి. జూలై 2024లో 45.50లక్షల నుంచి ఫిబ్రవరిలో 22.60లక్షలకు పడిపోయింది.
మరోవైపు మంగళవారం(మార్చి11) సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(CDSL) షేర్లు ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. 2025 మొదటి రెండున్నర నెలల్లో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (CDSL) షేర్లు దాదాపు 40శాతం క్షీణించాయి. ఈ తగ్గుదల వల్ల స్టాక్ దాని గరిష్ట స్థాయి రూ.1,989 నుంచి దాదాపు సగానికి పడిపోయింది.