కడెం, వెలుగు: నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ను మంగళవారం సీఈ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ గేట్ నెంబర్ 1,2,5 లను పరిశీలించి ప్రాజెక్ట్ లో భారీగా వరద నీరు వచ్చినపుడు తీసుకొనే చర్యల గురించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అలాగే ప్రాజెక్ట్ గేట్ల ట్రయల్ రన్ , నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్కాడ్ సిస్టంను పరిశీలించారు. నాకాలంను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశిం చారు. ఆయన నిర్మల్ ఎస్. ఈ సుశీల్ కుమార్, డి ఈ మధు సూదన్ రెడ్డి, ఈఈ విఠల్ తో పాటు తదితరులు ఉన్నారు.