- కేంద్ర పాలితప్రాతం పుదుచ్చేరిలో కూడా
న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోడా మీడియా సమావేశం పెట్టి షెడ్యూల్ విడుదల చేశారు. పుదుచ్చేరితోపాటు ఐదు రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పెద్దఎత్తున టెక్నాలజీని ఉపయోగించనుండడంతోపాటు.. ఎన్నికల నిర్వమణకు రెండు లక్షల 70వేల మంది సిబ్బందిని వినియోగించనున్నట్లు సీఈసీ ప్రకటించారు.
అసోం షెడ్యూల్:
అసోం అసెంబ్లీకి 3 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 2న నోటిఫికేషన్ జారీ. మార్చి 8 వరకు నామినేషన్ల దాఖలు, మార్చి 10 నామినేషన్ల పరిశీలన,
3 దశల్లో పోలింగ్: మార్చి 27న మొదటి దశ, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 మూడోదశ పోలింగ్
ఓట్ల లెక్కింపు: మే 2న
కేరళ షెడ్యూల్
కేరళ చిన్న రాష్ట్రమైనందున ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 6న పోలింగ్.. మే 2న కౌంటింగ్ నిర్వహిస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 6న రాష్ట్రంలోని మల్లాపురం లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక కూడా అసెంబ్లీ ఎన్నకలతోపాటే నిర్వహిస్తారు.
పుదుచ్చేరి షెడ్యూల్
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఇవి కూడా చదవండి
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు
28న ‘ప్రైవేట్’తో ఇస్రో తొలి ప్రయోగం
పోలీసుల మెరుపు వేగం.. 3 గంటల్లో కిడ్నాపర్ల అరెస్టు
కోర్ట్ ఆదేశాలతో మీడియా బులిటెన్ రిలీజ్..ఇవాళ రాష్ట్రంలో 189 మందికి కరోనా పాజిటివ్