హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని ఆయన చెప్పారు. ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదని.. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరాయని రాజీవ్ కుమార్ తెలిపారు. ఫామ్ అందిన తర్వాతే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించామని చెప్పారు.
తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లుగా ఉన్నాయని.. కొత్తగా 8. 11 లక్షల యువత నమోదు చేసుకున్నారని వెల్లడించారు. తెలంగాణలోయవ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. 80 ఏళ్లు నిండిన వారికి వర్క ప్రమ్ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని రాజీవ్ కుమార్ ప్రకటించారు. 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 7, 600గా ఉందని... పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించామని పేర్కొన్నారు. 2022-23 లో తెలంగాణలో 22 లక్షల ఓట్లను తొలగించామని అన్నారు. 35 వేల 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Also Read :- పథకాలు ప్రారంభించేది రాజకీయ నాయకుల స్వార్థం కోసమే
రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్న(అక్టోబర్ 04) విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఇందులో పురుషులు1,58,71,493 కాగా.. మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్ఓటర్లు 2,557 మంది ఉన్నారు. వీటికి సర్వీస్ ఓటర్లను కలిపితే ఈ సంఖ్య 3,17,32,727కు చేరుతుంది. ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేసిన జాబితాతో పోలిస్తే 5.8 శాతం ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఈసీ తెలిపింది. కొత్తగా 17.01 లక్షల మంది ఓటు హక్కును పొందారు.