అదృష్టం బాగుంది: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ హెలికాఫ్టర్ పొలాల్లో దిగింది..!

అదృష్టం బాగుంది: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ హెలికాఫ్టర్ పొలాల్లో దిగింది..!

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం కలకలం రేపింది. బుధవారం (అక్టోబర్ 10, 2024) మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో సీఈసీ రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఉత్తరాఖండ్లోని పితోరాగర్ ప్రాంతంలోని రాలామ్ అనే గ్రామంలోని పొలాల్లో ఎమర్జెనీగా ల్యాండ్ అయింది.

 

హెలికాఫ్టర్ సురక్షితంగా ల్యాండ్ అవడంతో సీఈసీతో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సీఈసీతో పితోరాగర్ జిల్లా మేజిస్ట్రేట్ మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పితోరాగర్ జిల్లా మేజిస్ట్రేట్ నిర్ధారించారు. ఉత్తరాఖండ్లోని ఆది కైలాష్ ప్రాంతంలో పర్యటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ హెలికాఫ్టర్లో బయల్దేరి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.