ఓటరు నమోదు, వివరాల చెకింగ్, సవరణల కోసం అన్ని ఫార్మ్స్ తో కేంద్ర ఎన్నికల సంఘం ఓ యాప్ ను తీసుకొచ్చింది. అదే Voter Helpline యాప్. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జీహెచ్ఎంసీ మరోసారి ఈ యాప్ ను ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ఉపయోగించుకుని ఓటర్ గా నమోదు చేసుకోవాలని కోరింది.
గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లలో వోటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని.. అధికారులు ప్రకటించారు. యాప్ లో ఓటర్ రిజిస్ట్రేషన్, ట్రాన్స్ ఫర్ /షిఫ్టింగ్, డిలీషన్/ కరెక్షన్ లాంటివి కొన్ని క్లిక్స్ తోనే చేసేయ్యొచ్చు.
ఈ యాప్ తో.. మీ పేరు, ఎపిక్ నంబర్ చెక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఫామ్స్ ను సబ్ మిట్ చేయొచ్చు. సబ్ మిట్ చేసిన ఫామ్ స్టేటస్ ను తెల్సుకోవచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్ వివరాలను తెల్సుకుని సంప్రదించొచ్చు.
ఏవైనా ఫిర్యాదులు ఉన్నా వాటిని ఈ యాప్ తో అధికారులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
అంతేకాదు.. యాప్ లో ప్రెస్ రిలీజెస్, ఈసీ ప్రోగ్రామ్స్, కరెంట్ ఇష్యూస్, ఎలక్షన్ ప్రాసెస్, ఈసీ అవగాహన కార్యక్రమాలు, ఈవీఎం పనితీరు, పార్టీలు, వాటి హిస్టరీ, క్యాండిడేట్లు, ఎన్నికల డేటా అంతా పొందుపరిచారు.
ప్రతి ఓటర్ ప్రజాస్వామ్యంలో భాగమేనని.. అందరినీ పోలింగ్ లో భాగస్వామ్యం చేయడమే తమ లక్ష్యమని కేంద్ర ఎన్నికల కమిషన్ చెబుతోంది. ప్రతి ఓట్ కౌంట్ అవుతుందని తెలిపింది.