
జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ. 5 లక్షల విలువ చేసే 28 సెల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా అప్పగించినట్లు బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ తెలిపారు. ఈ ఫోన్లను సీఐ గడ్డం మల్లేశ్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.