- ఇష్టమైన వాళ్ల కోసం సమ్‌థింగ్ స్పెషల్
- క్రియేటివ్‌గా వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్
- కలర్ ఫుల్ థీమ్ బెలూన్స్‌తో సర్ ప్రైజ్‌లు
- కస్టమైజ్డ్ రోస్ బాక్స్ బొకేలకు ఫుల్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: వాలెంటైన్స్ డే. లవర్స్ కి, న్యూలీ మ్యారిడ్ కఫుల్స్ కి ఇదో స్పెషల్ డే. ఈ రోజును తమ పార్ట్నర్ కు లైఫంతా గుర్తుండేలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేయాలని భావించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. సమ్ థింగ్ న్యూ గా ఉంటూ తన ప్రేమను గొప్పగా చెప్పాలని ఆరాటపడే వారికోసం మార్కెట్ లోనూ ఢిపరెంట్ కాన్సెప్ట్ లు అందుబాటులోకి వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ వస్తున్న కొత్త రకం గిఫ్ట్ లు, సర్ ప్రైజ్ థీమ్ లతో తమ ప్రియమైన వారిని అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ సారి కరోనా ఎఫెక్ట్ ఉండటంతో చాలా మంది ఇండోర్ లోనే అంటే ఇళ్లలోనూ, కేఫ్ లలోనూ, హోటళ్లలోనూ ఢిపరెంట్ గా లవర్స్ డే సెలబ్రేషన్స్ కు రెడీ అయ్యారు. మరికొంత మంది లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు కలుసుకోలేకపోవటంతో డెస్టినేషన్ లో లవర్స్ డే ను ప్లాన్ చేసుకున్నారు.
డెకరేషన్ కోసం అడ్వాన్స్ బుకింగ్
ఈ సారి వాలెంటైన్స్ డే కు చాలా మంది కలర్ ఫుల్ థీమ్ బెలూన్స్ డెకరేషన్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇండోర్ లోనే సెలబ్రేషన్స్ చేసుకోవటానికి ఇష్టపడుతున్న వారంతా వీటినే అడ్వాన్స్ గా బుకింగ్ చేస్తున్నారు. బెలూన్స్, రోసెస్ తో రూమ్ ని అందంగా డెకరేట్ చేసి సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కొత్త థీమ్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. బెలూన్ స్టోర్స్ నిర్వాహకులు, ఈవెంట్ ఆర్గనైజర్స్ కస్టమర్స్ రిక్వైర్ మెంట్స్ కు అనుగుణంగా ప్యాకేజ్ లు సిద్ధం చేశారు. రూ. 1700 నుంచి 10 వేల వరకు ప్యాకేజ్ రేట్లు నిర్ణయించారు. ఆల్ఫబెట్స్ తో ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ, బీ విత్ మీ, లవ్, హ్యాపీ వాలెంటైన్స్ డే వంటి అక్షరాలను రోసెస్ మధ్య సెట్ చేస్తూ డెకరేట్ చేయటంతో మంచి లుక్ వస్తోంది. దీంతో చాలా మంది ఈ సారి వాలెంటైన్స్ డే కు థీమ్ బెలూన్స్ డెకరేషన్ కు ఆర్డర్ ఇస్తున్నారని మాదాపూర్ కి చెందిన ఓ బెలూన్ స్టోర్ ఓనర్ తెలిపారు.
ఫ్లవర్ గిఫ్ట్ లకు క్రేజ్
వాలైంటెన్స్ డే కి ఫ్లవర్ గిఫ్ట్ అనేది కంపల్సరీగా మారింది. తమ వారికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినప్పటికీ ఓ ఫ్లవర్తోగానీ అందమైన బొకేతోగానీ ముందు విష్ చేస్తారు. వీటిని చాలా రోజుల పాటు గుర్తుగా పెట్టుకునే వారుంటారు. ఫ్లవర్స్ రెండు, మూడు రోజుల్లోనే వాడిపోతుండటంతో మార్కెట్లోకి ఇప్పుడు కొత్త రకం రోసెస్ అందుబాటులోకి వచ్చాయి. ఏడాది పాటు తాజాదనంగా ఉంటూ వాడిపోకుండా ఉంటాయి. దీంతో వీటిని గిఫ్ట్ గా ఇవ్వటానికి ఆసక్తి చూపుతున్నారు. డిఫరెంట్ కలర్స్ తో అందంగా డిజైన్ చేసే బొకే లను ఫుల్ క్రేజ్ గా కొంటున్నారు. ఇప్పుడు స్పెషల్ గా రోసెస్ బాక్సెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ రోజ్ బాక్సెస్ అండ్ లాంగ్ లాస్టింగ్ రొసెస్ మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. కస్టమైజ్డ్ గా ఉండే బోకేస్ కి క్రేజ్ విపరీతంగా పెరిగింది. నచ్చిన ఫ్లవర్స్ తో ఇష్టమైన వారి పేరులో మొదటి అక్షరాన్ని వచ్చేలా చేయించి దాని చుట్టూ వేరే పూలతో డెకరేట్ చేసి కస్టమైజ్డ్ బొకేలు ఆర్డర్ చేస్తున్నారు.
డెస్టినేషన్ సెలబ్రేషన్స్
కొంతమంది మరింత స్పెషల్ గా లవర్స్ డే ను జరుపుకునేందుకు డెస్టినేషన్ సెలబ్రేషన్స్ కు రెడీ అయిపోయారు. ఇప్పటికే సిటీ నుంచి గోవా, కూర్గ్, మనాలి సహా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. వాలైంటైన్స్ డే రోజు మొత్తాన్ని తమ వారితోనే ఉండి సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో కన్నా ఈ సారి డెస్టినేషన్ సెలబ్రేషన్స్ కు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. చాలా మంది వేరే స్టేట్స్ లోని టూరిస్ట్ ప్లేస్ లకు వెళ్లారు. కరోనా కారణంగా గతేడాది లవర్స్ ఎక్కువగా కలుసుకోలే పోయారు. దీంతో ఈ సారి వాలంటైన్స్ డే స్పెషల్ గా ఏకాంతంగా గడిపేందుకు డెస్టినేషన్ సెలబ్రేషన్స్ కు ఇంట్రెస్ట్ చూపారు.
సర్ ప్రైజ్ ప్లాన్ చేశా
ఫిబ్రవరి 13 నా మ్యారేజ్ డే. తర్వాతి రోజు వాలంటైన్స్ డే కావడంతో రెండింటిని ఒకేసారి సెలబ్రేట్ చేసుకుంటా. నా వైఫ్ కి రోసెస్ అంటే ఇష్టం. ఇంట్లోని ఓ రూమ్ లో రెడ్ కలర్ రోసెస్, రెడ్ అండ్ వైట్ బెలూన్స్ తో డిఫరెంట్ థీమ్‌లో డెకరేషన్ ఉండేలా ప్లాన్ చేశా. వాలంటైన్స్ డేకి తనకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నా.
– విజయ్, బంజారాహిల్స్
టైమ్ స్పెండ్ చేసేలా
డెస్టినేషన్ సెలబ్రేషన్స్ ను చాలా మంది లవర్స్, కొత్తగా పెళ్లయిన కపుల్స్ ఇష్టపడుతున్నారు. గతంలో అండమాన్, కూర్గ్, కులుమనాలి వెళ్లేవారు. ప్రస్తుతం గోవా వెళ్లేందుకు ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇష్టమైన వారితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేందుకు ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు.
– గణేష్ , ట్రావెల్ సంస్థ ఓనర్