అన్నాసాగర్ లో బోనాల పండుగ

అన్నాసాగర్ లో బోనాల పండుగ

ఎల్లారెడ్డి, వెలుగు : ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ లో బోరంచ పోచమ్మ గుడి నూతనంగా నిర్మించిన సందర్భంగా ఆదివారం గ్రామస్తులు  ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ రజితావెంకట్రాంరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పోచమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. వేడుకల్లో ఎల్లారెడ్డి మండల యూత్ ఉపాధ్యక్షుడు కిరణ్,  మాజీ జడ్పీటీసీ సామేల్, గ్రామ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ గురుప్రతాప్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగం శంకరయ్య, గ్రామ యూత్ అధ్యక్షుడు మహ్మద్ నజీర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామగౌడ్, ఉపాధ్యక్షుడు మహేశ్, నాయకులు పాల్గొన్నారు.