ఇండోర్ లో ఘనంగా రంగ్ పంచమి వేడుకలు

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రంగ్ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేలాది మంది చారిత్రక కట్టడం రాజ్ బడా ముందు చేరి రంగులతో హోలీ ఆడారు. కరోనా వల్ల రెండేళ్ల పాటు రంగ్ పంచమికి దూరంగా ఉన్న ఇండోర్ ప్రజలు.. గ్రాండ్ గా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రంగ్ పంచమి రోజున హోలీ ఆడుతారు. హోలీ జరిగిన ఐదు రోజుల తర్వాత రంగ్ పంచమిని జరుపుకుంటారు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్, భోపాల్ లోని మరి కొన్ని ప్రాంతాల్లో రంగ్ పంచమి జరుపుకుంటారు. ఇండోర్ లో రంగ్ పంచమి ప్రత్యేక ఫాగ్ యాత్ర. ఈ ఫాగ్ ఉరేగింపులో మధ్యప్రదేశ్ మంత్రి తులసి సావంత్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

టార్గెట్ 2027: ఎమ్మెల్యేగా గెలుపు.. ఎంపీ పదవికి రాజీనామా

నేను ముత్యాల ముగ్గు హీరోయిన్.. రేవంత్ రెడ్డి విలన్