ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహమ్మద్​ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఇందూరులో భారీగా ర్యాలీ నిర్వహించారు. బోధన్‌‌‌‌లో పెద్ద పోస్టాఫీస్‌‌‌‌ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హనుమాన్ మందిరం, పాత బస్టాండ్ మీదుగా రాకాసిపేట్ వరకు ర్యాలీ తీశారు. కోటగిరిలో జరిగిన వేడుకల్లో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ మండల ప్రెసిడెంట్ ఎజాస్ ఖాన్, ఎంపీటీసీ కొట్టం మనోహర్, ఉప సర్పంచ్ అర్షద్ నిలోఫర్​ ఫాతిమా, లీడర్లు జుబేర్, చోటేమియా, సలీం, వహీద్, మసూద్, బాబుఖాన్, ఇస్మాయిల్ పాల్గొన్నారు. - నిజామాబాద్‌‌‌‌/బోధన్/కోటగిరి, వెలుగు   

ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించి సినీ ప్రముఖులు
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో నర్సింగ్‌‌‌‌పల్లిలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని ప్రముఖ నటుడు ప్రకాశ్‌‌‌‌రాజ్, నిర్మాత దిల్ రాజు, ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరాం ఆదివారం పరిశీలించారు. గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ‘మా పల్లే చారిటబుల్ ట్రస్ట్’ కొన్ని రోజులుగా అభినందిస్తోంది. ఇందులో భాగంగానే నర్సింగ్‌‌‌‌పల్లి రైతు నర్సింహారెడ్డిని ప్రశంసించారు. అనంతరం సాయంత్రం ‘మా పల్లే చారిటబుల్ ట్రస్ట్’ వెబ్ సైట్‌‌‌‌ను ప్రకాశ్‌‌‌‌రాజ్ ప్రారంభించారు.  ‌‌‌‌‌‌‌‌- వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌


ఆలయాల్లోప్రత్యేక పూజలు
ఆర్మూర్, వెలుగు: పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. కాశీ హనుమాన్ మందిరంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, కౌన్సిలర్ తాటి హనుమంతు పాల్గొన్నారు.


దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి
కామారెడ్డి, వెలుగు : సీఎం కేసీఆర్ తీసుకున్న రైతు సంక్షేమ కార్యక్రమాలతో  తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పతుల దిగుబడి నాలుగింతలు పెరిగిందని, మన దగ్గర నుంచే దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆహార గింజలను సప్లై చేస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో పలు డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ పనుల ప్రారంభోత్సవంతో పాటు మార్కెట్​ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్‌‌‌‌తో కలిసి స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 8 ఏళ్లలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలు, స్కీమ్‌‌‌‌లతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కోటి 5 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యేవని, ఇప్పుడు అది 2 కోట్లకు పెరిగిందన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్‌‌‌‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పీకర్ చెప్పారు. అయితే మనల్ని ప్రోత్సహించాల్సిన కేంద్రం ఈర్షతో కాళ్లకు కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అంతకుముందు సదాశివనగర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌గా పుల్గం సాయిరెడ్డి, వైస్ చైర్మన్‌‌‌‌గా రాజేందర్‌‌‌‌‌‌‌‌తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశంలో ఎంపీపీలు అనసూయ, దశరథ్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.  

కవిత్వం సమాజంలో మంచిని పెంచాలి
కామారెడ్డి, వెలుగు: సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచేందుకు కవిత్వం పనిచేయాలని తెలంగాణ రచయితల వేదిక జిల్లా ప్రెసిడెంట్ గఫూర్ శిక్షక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఈడీ కాలేజీలో ఆదివారం ‘కవిత్వం- ప్రయోజనం’ అనే ఆంశంపై నిర్వహించిన చర్చా గోష్టిలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ జన చైతన్యం కోసం తెరవే ఎంతో కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్​గంగా ప్రసాద్, ప్రతినిధులు పీతాంబర్, నాగభూషణం, వైద్య శేషారావు, లింగం, రామచంద్రం, చంద్రకాంత్ తదితరులు  పాల్గొన్నారు. 

బీమా చెక్కుల అందజేత
లింగంపేట, వెలుగు: మండలంలోని సురాయిపల్లి, అయ్యపల్లి, పర్మల్ల గ్రామాలకు చెందిన ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే జాజాల సురేందర్‌‌‌‌‌‌‌‌ ఆదివారం బీమా చెక్కులను అందజేశారు. టీఆర్ఎస్ సభ్యత్వం కలిగి ఉండి వివిధ కారణాలతో ఇటీవల ముగ్గురు కార్యకర్తలు చనిపోయారు. దీంతో అదిష్టానం ఒక్కొక్కరికి రూ.2 లక్షల బీమాను మంజూరు చేయగా ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్​వైస్‌‌‌‌చైర్మన్ గజవాడ నరహరి, టీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, ప్రధాన కార్యదర్శి అట్టెం శ్రీనివాస్, యూత్​ అధ్యక్షుడు సుప్పాల నరేశ్‌‌‌‌, లీడర్లు అబ్దుల్ నయీం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బండి రాజయ్య పాల్గొన్నారు.

పిట్లంలో రక్తదాన శిబిరం
పిట్లం, వెలుగు: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఆదివారం పిట్లంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా  మైనార్టీ యూత్ కమిటీకి చెందిన 30 మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం పిట్లం రెడ్​క్రాస్​ సొసైటీ ప్రెసిడెంట్ బుగుడాల నవీన్ మాట్లాడుతూ రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేయడం లాంటిందన్నారు. కార్యక్రమంలో రెడ్​క్రాస్ బాన్సువాడ డివిజన్ ప్రెసిడెంట్ మర్గల వేణుగోపాల్, పిట్లం వైస్​ ప్రెసిడెంట్ బొడ్ల రాజు, మైనార్టీ నాయకుడు జమీర్, బ్లడ్ బ్యాంక్​  టెక్నిషియన్లు రఘు, శ్రీనివాస్ పాల్గొన్నారు.


నాళేశ్వర్‌‌‌‌‌‌‌‌లో ‘లంపీ స్కిన్’ కలకలం

పశువుల రక్త నమూనాల సేకరణ
నవీపేట్ ,వెలుగు: మండలంలోని నాళేశ్వర్‌‌‌‌‌‌‌‌లో పశువులకు లంపీ స్కిన్ వ్యాధి సోకిందన్న ప్రచారం కలకలం రేపింది. గ్రామంలోని బేగరి రాజేశ్వర్, పాండు రాజేశ్వర్ రెండు గేదెలకు గత మూడు రోజుల నుంచి లంపీ స్కిన్ వ్యాధి సోకిందని ఓ యువకుడు సర్పంచ్ సరీన్, పీఏసీఎస్ చైర్మన్ మగ్గారి హనుమాండ్లుకు సమాచారం ఇచ్చాడు. సర్పంచ్‌‌‌‌ జిల్లా వెటర్నరీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ నరేందర్‌‌‌‌‌‌‌‌కు తెలపడంతో ఆదివారం ఆయన గ్రామంలోని రెండు పశువులతో పాటు తుంగిని గ్రామంలోని నాలుగు పశువులను పరిశీలించారు. వాటి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌‌‌‌కు పంపించినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో రెండు రోజుల పాటు క్యాంప్ నిర్వహిస్తామని చెప్పారు.

కవిత్వం సమాజంలో మంచిని పెంచాలి
కామారెడ్డి, వెలుగు: సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచేందుకు కవిత్వం పనిచేయాలని తెలంగాణ రచయితల వేదిక జిల్లా ప్రెసిడెంట్ గఫూర్ శిక్షక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఈడీ కాలేజీలో ఆదివారం ‘కవిత్వం- ప్రయోజనం’ అనే ఆంశంపై నిర్వహించిన చర్చా గోష్టిలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ జన చైతన్యం కోసం తెరవే ఎంతో కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్​గంగా ప్రసాద్, ప్రతినిధులు పీతాంబర్, నాగభూషణం, వైద్య శేషారావు, లింగం, రామచంద్రం, చంద్రకాంత్ తదితరులు  పాల్గొన్నారు. 

సాలూర రోడ్డును పరిశీలించిన ఆర్అండ్‌‌‌‌బీ ఎస్ఈ
బోధన్, వెలుగు: బోధన్ నుంచి సాలూర అంతరాష్ట్ర చెక్​పోస్టు నుంచి మహారాష్ట్రకు వెళ్లే రోడ్డును ఆర్అండ్‌‌‌‌బీ ఎస్ఈ రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదివారం  పరిశీలించారు. బోధన్ నుంచి సాలూరకు వెళ్లే రోడ్డు  గతంలో ఆర్అండ్‌‌‌‌బీ పరిధిలో ఉండేది. ఈ రోడ్డు ఎన్‌‌‌‌హెచ్ పరిధిలోకి రావడంతో మరమ్మతుల పనులు పట్టించుకోవడం లేదు. రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో స్థానిక నాయకులు మంత్రి వేముల ప్రకాంత్‌‌‌‌రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకవెళ్లారు. స్పందించిన మంత్రి ఆర్అండ్‌‌‌‌బీ ఎస్ఈని ఆదేశించడంతో ఆదివారం ఆయన రోడ్డును పరిశీలించారు. త్వరలో  రిపేర్లు చేస్తామని ఎస్ఈ చెప్పారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్లు గిర్దావర్‌‌‌‌‌‌‌‌ ​ గంగారెడ్డి, జి.శరత్​, రైతు బంధు మాజీ మండల  కోఆర్డినేటర్​ బుద్దె రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్​జి.నర్సయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌‌‌‌ సాలూర షకీల్, నాయకులు వెంకటి పటేల్, గంగారం, శివకాంత్ ​పటేల్ ఉన్నారు.  

అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నరు': మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి
వేల్పూర్, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ జన రంజక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై యువత టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన వివిధ యువజన సంఘాల సభ్యులు ఆదివారం మంత్రి సమక్షంలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ పరిపాలన రోజురోజుకూ దిగజరుతోందన్నారు. మోడీ పేదలను కొట్టి పెద్దలకు పంచి పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరగాలని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీని పెడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు  పాల్గొన్నారు.

స్కూళ్లను క్లీన్ చేయాలి
భిక్కనూరు, వెలుగు: దసరా సెలవులు పూర్తి అయిన స్కూళ్ల రీఓపెన్‌‌‌‌ నేపథ్యంలో విద్యా సంస్థలను క్లీన్‌‌‌‌ చేయాలని ఏబీవీపీ మండల అధ్యక్షుడు సమీర్​ఖాన్​డిమాండ్‌‌‌‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌ స్కూళ్లు, కాలేజీల్లో పరిశుభ్రత పాటించాలన్నారు. హాస్టళ్ల పరిసరాల్లో పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు. సమావేశంలో శివకృష్ణ, రాజేందర్​భాను, అజయ్ పాల్గొన్నారు.  

పేకాడుతున్న ఏడుగురి అరెస్ట్‌‌‌‌
మెండోరా, వెలుగు: మండలంలోని పోచంపాడ్ చౌరస్తా వద్ద పేకాట స్థావరాలపై దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.  చౌరస్తా వద్ద  శనివారం అర్ధరాత్రి ఒక ఇంటి ముందు పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో దాడి చేయగా ఏడుగురు దొరికారని చెప్పారు. వారి నుంచి రూ.31,050 స్వాధీనం చేసుకుని, బీరవెల్లి గ్రామానికి చెందిన నిమ్మల శ్రీనివాస్, బాల్కొండకు చెందిన మొహమ్మద్ యూనూస్, నిర్మల్‌‌‌‌కు చెందిన మహమ్మద్ ఇంతియాజ్, అంజాద్, సారంగపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన సయ్యద్ యూసుఫ్, దిలావర్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మేడిపల్లి దేవేందర్, షెట్పల్లికి చెందిన ఎ.నరసయ్యలను అరెస్టు చేసినట్లు చెప్యపారు.  


రేపు బీజేపీ నియోజకవర్గ సమావేశం
పిట్లం, వెలుగు: ఈనెల 11న బీజేపీ జుక్కల్ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌‌‌‌చార్జి బద్దం మహిపాల్‌‌‌‌రెడ్డి చీఫ్ గెస్ట్‌‌‌‌గా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. బిచ్కుంద బండా యప్ప ఫంక్షన్ హాల్‌‌‌‌లో ఉదయం 10 గంటలకు జరిగే ఈ మీటింగ్‌‌‌‌కు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. 


వాల్మీకికి ఘన నివాళి
మహర్షి వాల్మీకి జయంతిని ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డి కలెక్టరేట్‌‌‌‌లో జరిగిన ప్రోగ్రామ్‌‌‌‌లో కలెక్టర్ జితేష్ వి పాటిల్, బీసీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్​ శ్రీనివాస్, ప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్‌‌‌‌లో జరిగిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌‌‌‌రావు, అడిషనల్‌‌‌‌ కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు నరేశ్‌‌‌‌, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, బీసీ సంఘాల ప్రతినిధులు బుస్సా ఆంజనేయులు, నరాల సుధాకర్, మాడవేడి వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఎం.రాజేశ్వర్, రవీందర్ పాల్గొన్నారు.
 - వెలుగు, నిజామాబాద్‌‌‌‌/కామారెడ్డి

రాజకీయ చైతన్య దీప్తి కాన్షీరాం..
బీసీల్లో రాజకీయ చైతన్యం నింపిన కాన్షీరాం సేవలు మరువలేని పలువురు వక్తలు అన్నారు. బీఎస్పీ వ్యవస్థాపకుడైన కాన్షీరాం వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.  భిక్కనూరులో జరిగిన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగల రవీందర్, ​ఉపాధ్యక్షుడు ఫర్వేజ్, కార్యదర్శి కర్రోల్ల రాజు, భాను, కృష్ణ పాల్గొన్నారు. బోధన్‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీ బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల ఇన్‌‌‌‌చార్జీలు సింగాడే పాండు, నీరడి ఈశ్వర్, ప్రెసిడెంట్ కుప్పిరాల రాంచందర్, నాయకులు యూసూఫ్, నరేశ్‌‌‌‌, రమాకాంత్, మారుతి, రామకృష్ణ పాల్గొన్నారు. - భిక్కనూరు/బోధన్‌‌‌‌, వెలుగు