ఒక్కరోజే రూ.228 కోట్ల పనులు షురూ

 ఒక్కరోజే రూ.228 కోట్ల పనులు షురూ
  • ఊరూరా ‘ప‌‌‌‌నుల జాత‌‌‌‌ర‌‌‌‌’ 

హైదరాబాద్, వెలుగు: రాజ్యంగ దినోత్సవం, ప్రజాపాలన- విజయోత్సవాల సందర్భంగా  గ్రామ పంచాయతీల్లో మంగ‌‌‌‌ళవారం ‘పనుల జాతర’ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే రూ.228.07 కోట్లతో 15,094 పనులకు ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అభివృద్ధి ప‌‌‌‌నుల‌‌‌‌కు శంకుస్థాప‌‌‌‌నలు చేశారు. 

ములుగు జిల్లా ఇంచ‌‌‌‌ర్ల గ్రామంలో మంత్రి సీత‌‌‌‌క్క లాంఛ‌‌‌‌నంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇంచర్ల గ్రామ శివారులోని జాతీయ రహదారి నుంచి సీఆర్పీఎఫ్ బెటాలియన్ వరకు రూ.35 లక్షలతో సీసీ రోడ్డు, రూ.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, అదే గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాప‌‌‌‌న చేశారు.