గాంధీ భవన్​లో మహిళా కాంగ్రెస్ సంబురాలు.. సభ్యత్వాలు లక్ష దాటడంతో వేడుకలు

గాంధీ భవన్​లో మహిళా కాంగ్రెస్ సంబురాలు.. సభ్యత్వాలు లక్ష దాటడంతో వేడుకలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు లక్ష దాటడంతో గురువారం గాంధీభవన్ లో మహిళలు సంబురాలు జరుపుకున్నారు.  పటాకులు కాల్చి ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు మాట్లాడుతూ.. ఈ నెల 24న మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుందని, దీనికి జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా చీఫ్ గెస్టుగా హాజరువుతారని చెప్పారు. అదే రోజున 5 వేల మందితో గాంధీ భవన్ లో మరోసారి సంబురాలు చేస్తామని పేర్కొన్నారు.