
కామారెడ్డిటౌన్ , వెలుగు: జహీరాబాద్‌తో పాటు స్టేట్‌లో రాష్ట్రంలో 8 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడంతో బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో హస్తం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ జిల్లా ఆఫీసు వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోనే శ్రీనివాస్, లీడర్లు కారంగుల ఆశోక్‌రెడ్డి, చాట్ల రాజేశ్వర్, లక్కపత్ని గంగాధర్, అంజద్, రవి పాటిల్, సిరాజోద్ధిన్, పిల్లి మల్లేష్, శంకర్ పాల్గొన్నారు.