సికింద్రాబాద్, వెలుగు: వన భోజనాలతో ఐక్యత, స్నేహభావం పెంపొందుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి, మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సనత్ నగర్ లోని పార్క్ 2 లో నిర్వహించిన వన భోజనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సురేశ్ గౌడ్, పీయూష్ గుప్తా, రాజేశ్ పాల్గొన్నారు. అలాగే సనత్ నగర్ లోని హనుమాన్ టెంపుల్ ఆవరణలో బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ఆయన ల్యాప్ టాప్ లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, త్రిదండి దేవనాద రామానుజాచార్యులు, సమాఖ్య సభ్యులు ఎంవీ శాస్త్రి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.